: టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ విజేత జింబాబ్వే
టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ విజేతగా జింబాబ్వే నిలిచింది. నాగ్ పూర్ వేదికగా టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే, హాంగ్ కాంగ్ జట్లు పోటీ పడ్డాయి. టాస్ గెలిచిన హాంగ్ కాంగ్ జట్టు జింబాబ్వేకు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే జట్టు సిబండ (59), చిగుంబర (30) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన హాంగ్ కాంగ్ జట్టు 158 పరుగుల లక్ష్యఛేదనలో తడబడింది. జేమ్స్ అట్కిన్సన్ (53) ఒంటరి పోరాటం, తన్వీర్ అఫ్జల్ (31) మెరుపులు హాంగ్ కాంగ్ ను విజయానికి దగ్గర చేయలేకపోయాయి. చివరి ఓవర్లో 23 పరుగులు కావాల్సి ఉండగా, కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన హాంగ్ కాంగ్ తొలి మ్యాచ్ లో ఓటమి పాలైంది.