: బెంగ‌ళూరు హ్యాక‌ర్‌కి ఫేస్‌బుక్ ప‌ది ల‌క్ష‌ల రివార్డ్


బెంగ‌ళూరు హ్యాకర్ ఆనంద్ ప్ర‌కాశ్‌ ఫేస్‌బుక్ నుంచి 15వేల డాల‌ర్ల (సుమారు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు) రివార్డు పొందాడు. ఫేస్‌బుక్‌ యూజ‌ర్స్ మెసేజెస్, ఫోటోస్, డెబిట్ కార్డ్ పిన్ నంబ‌ర్ వంటివి హ్యాక‌ర్స్ కొట్టేయ‌డానికి వీలుగా ఫేస్‌బుక్‌లో ఉన్న‌ బ‌గ్‌ను క‌నిపెట్టి, ఆ స‌మాచారాన్ని త‌మ‌కు అందజేసినందుకు స‌ద‌రు సంస్థ అత‌నికి ఈ రివార్డును ప్ర‌క‌టించింది. ఆనంద్ గ‌త‌నెల 22న‌ ఫేస్‌బుక్‌లో ఈ బ‌గ్‌ను క‌నిపెట్టి, ఆ సంస్థ‌కు రిపోర్ట్ చేశాడు. దీంతో ఫేస్‌బుక్ సంస్థ 15వేల డాల‌ర్లు రివార్డును ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఈ యువ‌కుడికి మెయిల్ పంపింది. ఆనంద్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సెక్యురిటీ అనలిస్ట్ గా ప‌నిచేస్తున్నాడు.

  • Loading...

More Telugu News