: ముహూర్తం 11వ తేదీ 11 గంటలకు... టీఆర్ఎస్ లోకి మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు


టీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కుదిరింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఆరెకపూడి గాంధీ టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాము కూడా టీఆర్ఎస్ లో విలీనం అయినట్టు ఈ మధ్యే ఆ పార్టీలో చేరిన ఎర్రబెల్లికి వీరు ఒక లేఖ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వారిద్దరూ టీఆర్ఎస్ లో చేరనున్నట్టు సమాచారం. దీంతో తెలంగాణలో టీడీపీ మరింత దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లింది.

  • Loading...

More Telugu News