: మహిళలకు కావాల్సింది...దుస్తులు, మేకప్, నగలు కాదు: సుధామూర్తి
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఎలాంటి మేలు చేయాలని ప్రపంచం మొత్తం మేధోమథనంలో పడింది. ఈ దశలో ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత, సామాజిక వేత్త సుధామూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళకు కావాల్సింది...అందమైన రూపం, ఖరీదైన నగలు, ధగధగలాడే దుస్తులు కాదని అన్నారు. మహిళలకు కావాల్సింది ఆత్మస్థైర్యం అని చెప్పారు. మహిళలు ముందు తమపై తాము నమ్మకముంచాలని ఆమె సూచించారు. దానితో పాటు నడవడి మహిళలకు మంచి ఆభరణమని ఆమె చెప్పారు. ఆత్మస్థైర్యం కలిగి, మంచి నడవడి కలిగిన మహిళల వద్దకు రావాలంటే ఎవరైనా ధైర్యం చేయాలని ఆమె సూచించారు. మహిళలు ముందుగా తమకంటూ ఓ నిర్దిష్టమైన క్యారెక్టర్ ఏర్పర్చుకోవాలని అన్నారు. అలా ఉంటే రూపం, దుస్తులు, నగలు ఇలా ఏవీ అవసరం లేదని అన్నారు. నడవడే మహిళల ఆభరణమని ఆమె చెప్పారు. ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటే మహిళలు సాధించని విజయాలు ఉండవని ఆమె అన్నారు. విజయానికి కొలమానాలు లేవని ఆమె చెప్పారు. ఆర్థిక స్వాతంత్ర్యం ఒక్కటే విజయం కాదని, విజయం అంటే ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయని ఆమె తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని ఆమె చెప్పారు. ఒక తల్లి సాధించే విజయాలు దేనితోనూ లెక్కించలేమని ఆమె చెప్పారు.