: ఇదో చిత్రం...మూడు రోజుల పాటు బ్యాంకుకు తాళం వేయకపోయినా ఏం జరగలేదు!


బ్యాంకులు, ఏటీఎంలు... ఇలా కాదేదీ చోరీలకు అనర్హం అన్నరీతిలో దొంగలు చెలరేగిపోతున్నారు. బ్యాంకులను కొల్లగొడుతూ, ఏటీఎంలను లేపేస్తున్న దశలో ఓ బ్యాంకుకు వరుసగా మూడు రోజుల పాటు తాళం వేయకపోయినా ఎలాంటి దోపిడీ జరగకపోవడం విశేషం. హైదరాబాదు, మోతీనగర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి గత మూడు రోజులుగా తాళం వేయలేదు. శనివారం విధులు నిర్వర్తించిన సిబ్బంది కార్యాలయానికి తాళం వేయడం మర్చిపోయారు. మంగళవారం విధులు నిర్వర్తించేందుకు వచ్చిన వ్యక్తి తాళం తెరిచేందుకు చూడగా, తాళం తీసి ఉంది. దీంతో బ్యాంకు సిబ్బంది, అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, సిబ్బంది బ్యాంకులో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి చోరీ జరగలేదని తేలడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే విషయం తెలిసిన స్థానికులు మాత్రం మూడు రోజులు తాళం వేయకపోయినా ఏం జరగకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News