: అస్థిపంజరాలతో పేకాడిన 'చలాకీ' చంటి
కామెడీ షో 'జబర్దస్త్' ఫేం 'చలాకీ' చంటి అస్థిపంజరాలతో పేకాడుతూ హల్ చల్ చేశాడు. చిత్రమైన వాచకంతో బుల్లితెర అభిమానులను ఆకట్టుకున్న చలాకీ చంటి ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకునేందుకు మూడు ఆసక్తికరమైన ఫోటోలు పోస్టు చేశాడు. అందులో ఒకటి ఆస్థిపంజరాలతో పేకాడుతున్న ఫోటో కాగా, రెండోది 'జబర్దస్త్'లో సహచరులపై తనదైన శైలిలో విరుచుకుపడేలా ఉన్న ఫోటో, మూడోది వాటితో నవ్వుతూ మాట్లాడుతున్న ఫోటో. ఈ మూడు ఫోటోలకు అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. పలువురు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ చంటికి జాగ్రత్తలు చెబుతున్నారు.