: తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒప్పందం: కేసీఆర్


తెలంగాణ బీళ్లలో గోదావరి నీళ్లు ప్రవహించాలి, రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని సీఎం కేసీఆర్ అన్నారు. ముంబై నుంచి హైదరాబాదు చేరుకున్న కేసీఆర్ బృందం బేగంపేట విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా బయలుదేరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని అన్నారు. ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు గోదావరి నీళ్లు అందజేస్తామని ఆయన చెప్పారు. సముద్రంలో కలిసిపోయే నీళ్లను వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలకు తరలిస్తామని ఆయన చెప్పారు. తొమ్మిది జిల్లాల్లో కోటి ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. చిన్నచిన్న ఇబ్బందులు ఎదురైనంత మాత్రాన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. బంగారు తెలంగాణ కల సాకారమయ్యే వరకు కేసీఆర్ నిద్రపోడని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ లో తాగునీరు సమస్యను కూడా గోదావరి నీళ్లతో పరిష్కరించనున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News