: ఆ భూములు నేను 2003లోనే కొనుగోలు చేశాను: లింగమనేని


అమరావతికి సమీపంలో 'లింగమనేని ఎస్టేట్స్' అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆ సంస్థ అధినేత లింగమనేని రమేష్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆ భూములను తాను 2003లో కొనుగోలు చేశానని చెప్పారు. దీనిపై దివంగత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్పట్లోనే కమిటీ వేసిందని, అది ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని హైకోర్టు తీర్పు కూడా ఇచ్చిందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఆ భూములను 2014లో తాను కొనలేదని ఆయన స్పష్టం చేశారు. వివిధ దేశాల్లో తాను చేసిన వ్యాపారాల ద్వారా సంపాదించిన ఆస్తులతో వ్యాపారం చేస్తున్నానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేశానని ఆయన చెప్పారు. అది అక్రమ నిర్మాణమా? లేక సక్రమమా? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తాను ఎలాంటి ప్రయోజనం పొందలేదని ఆయన చెప్పారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసి, ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడి పెట్టామా? అనే మరో ఆలోచన రానీయొద్దని ఆయన సూచించారు. వ్యాపారం చేసుకుంటూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News