: వైట్ కాలర్ దొంగలను అరెస్టు చేయాలి: కారెం శివాజీ


రాజకీయ నాయకుల అండదండలతో కోట్లాది రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలుగా పొంది ఎగ్గొడుతున్న వైట్ కాలర్ నేరగాళ్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ హైదరాబాదులోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సైఫాబాదులోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను రుణాల పేరిట దోచుకుంటున్న వైట్ కాలర్ నేరగాళ్లను సీబీఐతో అరెస్టు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖజానాను దోచుకుని పలువురు బడా వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News