: ఆసియాకప్ ప్రదర్శనతో సెలెక్టర్లకు ఉద్వాసన పలికిన శ్రీలంక
ఆసియాకప్ లో శ్రీలంక జట్టు ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. న్యూజిలాండ్ పర్యటనలో వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకోకుండానే భారత్ చేతిలో ఓటమిపాలవ్వడంపై ఆందోళన వ్యక్తమయినప్పటికీ, మాథ్యూస్, మలింగ వంటి సీనియర్ ఆటగాళ్లు గాయాలబారిన పడడంతో సరే అని సర్దిచెప్పుకున్నారు. అయితే, ఆసియాకప్ లో బంగ్లాదేశ్ జట్టుపై ఓటమిపాలవ్వడం శ్రీలంక క్రికెట్ బోర్డును ఆగ్రహానికి గురి చేసింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆటగాళ్లకు హితవు పలకడంతో పాటు సెలెక్టర్లపై వేటు వేసింది. దీంతో కొత్తగా శ్రీలంక సెలెక్టర్లుగా అరవింద్ డిసిల్వా, కుమార సంగక్కర, కలువితరణలు వ్యవహరించనున్నారు.