: మేము నాశనమైపోయినా సరే బీజేపీతో పొత్తు కొనసాగిస్తాం: ముఫ్తీ మెహబూబా


తాము సర్వనాశనమైపోయినా సరే బీజేపీతో పొత్తు కొనసాగిస్తామని జమ్మూకాశ్మీర్ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. కుప్వాడా జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తన తండ్రి మాట శిలాశాసనం లాంటిదని అన్నారు. ఆయన మాట జవదాటమని ఆమె చెప్పారు. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడమన్నది తన తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ రాసిన వీలునామా లాంటిదని ఆమె అన్నారు. దీని వల్ల రాజకీయంగా నాశనమైపోయినా దానిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. ఒక తండ్రి వీలునామా రాస్తే...దాని వల్ల పిల్లలు నాశనమైపోయినా సరే దానిని అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని ఆమె చెప్పారు. అలాగే తమ తండ్రి వీలునామాను తాము అమలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. దీంతో పీడీపీ-బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే రోజు మరెంతో దూరంలో లేదని అర్థమవుతోంది. కాగా, జమ్మూకాశ్మీర్ లో ప్రస్తుతం గవర్నర్ పాలన కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News