: దేవుడ్ని అందుకు క్షమిస్తా: రాంగోపాల్ వర్మ
తన అభిప్రాయాలను అందరికీ భిన్నంగా వ్యక్తీకరించడంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సిద్ధహస్తుడు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ట్వీట్ లోనూ అదే విభిన్నతను ప్రదర్శించాడు. భూమి మీద బొద్దింకలు, ఉగ్రవాదులు, హంతకులు వంటి ఘోరమైన వాటిని పుట్టించిన దేవుడు ఆడవాళ్లను కూడా సృష్టించాడన్న కారణంతోనే అతనిని క్షమిస్తున్నానని ట్వీట్ చేశాడు. మహిళలు ప్రతిరోజూ ఆనందంగా ఉంటారని నమ్ముతాను కనుక, తాను ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పనని తెలిపాడు. దేవుడి సృష్టిలో అందమైన పార్ట్ ఆడవాళ్లను సృష్టించడమేనని రాంగోపాల్ వర్మ చెప్పాడు.