: హైఎండ్ హార్లీ డేవిడ్ సన్ బైకుపై పార్లమెంట్ కు వచ్చిన కాంగ్రెస్ మహిళా ఎంపీ


ఖరీదైన హార్లీ డేవిడ్ సన్ బైకెక్కి పార్లమెంటుకు వచ్చిన కాంగ్రెస్ మహిళా ఎంపీ రంజీత్ రంజన్ మహిళా దినోత్సవం రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్లూ కలర్ చుడీదార్, కోట్ ధరించిన ఆమె, హెల్మెట్ పెట్టుకుని పార్లమెంట్ ఆవరణలోకి వచ్చి హల్ చల్ చేశారు. ఆమెను కవర్ చేసేందుకు మీడియా పోటీ పడింది. రంజీత్ రంజన్ బీహార్ వివాదాస్పద నేత పప్పూ యాదవ్ సతీమణి. అదే రాష్ట్రంలోని సౌపాల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. కాగా, నేడు పార్లమెంటులో మహిళలే మాట్లాడాలని ప్రధాని మోదీ సూచించడంతో, అందరూ మహిళా ఎంపీలే మాట్లాడుతున్నారు.

  • Loading...

More Telugu News