: టీ టీడీపీకి షాకిచ్చిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు... ఎలిమినేటి వర్ధంతికి మాగంటి, ఆరెకపూడి డుమ్మా


తెలంగాణలో టీడీపీకి మరో రెండు ఎదురు దెబ్బలు తగిలేలానే ఉన్నాయి. నిన్న పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరుకావాలన్న పార్టీ అధిష్ఠానం ఆదేశాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో పాటు మరో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కూడా ధిక్కరించారు. సాక్షాత్తు చంద్రబాబు పిలవమన్నారన్న పార్టీ నేతల సూచనలను కూడా వారు పెడచెవినపెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం దరిదాపుల్లోకే వారు రాలేదు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ టికెట్లపై విజయం సాధించిన మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని టీఆర్ఎస్ లాగేసింది. తాము వద్దనుకున్న ముగ్గురు మినహా మిగిలిన ఇద్దరు కూడా కారెక్కడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే మాగంటి, ఆరెకపూడిలతో టీఆర్ఎస్ నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయనే తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరూ సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపు వచ్చిందని తెలిసినా, నిన్నటి సమావేశానికి హాజరుకాలేదన్న వదంతులు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News