: పండంటి బిడ్డకు తల్లయిన తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ


హర్షా చావ్డా... దాదాపు 30 సంవత్సరాల క్రితం, అంటే 1986లో ముంబైలో పిల్లలు లేని ఓ జంటకు కృత్రిమ పద్ధతుల్లో జన్మించిన తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇప్పుడామె మరో బిడ్డకు తల్లయింది. ఆమె పుట్టినప్పుడు వైద్య సాయం చేసిన డాక్టర్ల బృందమే, ఇప్పుడు సిజేరియన్ చేసి పండంటి మగ బిడ్డను బయటకు తీశారు. "మహాశివరాత్రి పర్వదినం నాడు మా కుటుంబానికి పరమశివుడు ఇచ్చిన ఓ గొప్ప బహుమతి ఇది" అని హర్షా భర్త దివ్యపాల్ షా తన అనందాన్ని వెలిబుచ్చారు. తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త డాక్టర్ ఇందిరా హిందుజా, ఆ బేబీ పెరిగి పెద్దయి గర్భవతిగా వస్తే, తిరిగి ఆపరేషన్ నిర్వహించారు. ఆపై ఇందిర మాట్లాడుతూ, "హర్షా పుట్టిన రోజు నాకింకా గుర్తుంది. అప్పుడామె బరువు 3.18 కిలోలు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు ఎంత ఆనందించారో, నేను అంతకన్నా ఎక్కువగా ఆనందపడ్డా. ఆ తరువాత మేము 15 వేలకు పైగా టెస్ట్ ట్యూబ్ బేబీలను అందించాం" అన్నారు.

  • Loading...

More Telugu News