: ధోనీ అలా సమాధానం చెబితే, మేం ఇలా చెబుతాం!: ప్రతీకారం తీర్చుకున్న కేరళ అభిమానులు
ఆసియాకప్ టీ-20లో భాగంగా ఫైనల్ పోరుకు ముందు బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్, ధోనీ తలను తీసుకువెళుతున్నట్టుగా మార్ఫింగ్ చేసిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తనలోని ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ధోనీ మ్యాచ్ లో చూపించాడు కూడా. ఇక "మీ క్రికెట్ జట్టు మా ముందు ఎందుకూ పనికిరాదు. బంగ్లాదేశ్ పౌరులకు మా సందేశం ఇదే" అంటూ కేరళ సైబర్ వారియర్స్ కు చెందిన 15 మంది వైట్ హ్యాట్ హ్యాకర్ల బృందం బంగ్లాదేశ్ వెబ్ సైట్లను హ్యాక్ చేసుకుంటూ పోతోంది. 'ఆపరేషన్ ట్రాల్ బంగ్లాదేశ్' పేరిట సైబర్ దాడులు చేస్తూ, ప్రతి సైట్ లో ధోనీ ఫోటోను ఉంచుతోంది. తాము ఇండియన్స్ అయినందుకు గర్వపడుతున్నామని, తమ దేశాన్ని అవమానించే చర్యలను సహించబోమని హ్యాకర్ల బృందం సభ్యుడొకరు తెలిపారు. హ్యాకింగ్ అక్రమమే అయినా, ధోనీని అవమానించినందుకు అనుభవించాల్సిందేనని అన్నారు.