: సోమాలియాలో బాంబులు కురిపించిన అమెరికా!


ఆసియా ఖండంలో ఐఎస్ఐఎస్ వేళ్లూనుకున్న ఇరాక్, సిరియా ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడే అమెరికా, చానాళ్ల తరువాత ఆఫ్రికాపై బాంబుల వర్షం కురిపించింది. అల్ ఖైదా అనుబంధ సంస్థగా పనిచేస్తూ సోమాలియాను వణికిస్తున్న అల్ షబాబ్ స్థావరాలే లక్ష్యంగా దాడులు జరపగా, 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పెంటగాన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. పక్కా సమాచారంతో సోమాలియాలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న క్యాంపును కనుగొన్నామని, మరణించిన వారంతా ఉగ్రవాదులేనని రక్షణ విభాగం అధికారి డేవిడ్ వెల్లడించారు. వీరంతా ఆఫ్రికన్ యూనియన్ శాంతి దళాలపై దాడులు చేసేందుకు శిక్షణ తీసుకుంటున్నారని, ఇటీవల మొగదిషులోని హోటల్ పై దాడి చేసింది కూడా వీరేనని తెలిపారు.

  • Loading...

More Telugu News