: జగన్, ‘సాక్షి’కి ఏపీ మంత్రుల లీగల్ నోటీసులు

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో అధికార టీడీపీ నేతలు ‘భూదందా’కు పాల్పడ్డారంటూ వచ్చిన వార్తలపై ఏపీ మంత్రులు పొంగూరు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు నేటి ఉదయం ఘాటుగా స్పందించారు. బినామీ పేర్లతో భూములు కొన్నామంటూ తమపై అసత్య కథనాలు రాసిన ‘సాక్షి’ మీడియాతో పాటు ఆ పత్రిక కథనాన్ని ఆధారం చేసుకుని ఆరోపణలు గుప్పిస్తున్న విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వారు కొద్దిసేపటి క్రితం లీగల్ నోటీసులు జారీ చేశారు. అసత్యాలతో కథనాలు ప్రసారం చేయడం, ఆరోపణలు గుప్పించడంపై తక్షణమే క్షమాపణ చెప్పాలని సదరు నోటీసుల్లో మంత్రులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తామని వారు హెచ్చరించారు. నిన్నటిదాకా ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిన ఏపీ రాజకీయం నేడు నోటీసుల దాకా వెళ్లడం మరింత ఆసక్తికరంగా మారింది.