: కమలం చేజారనున్న కర్ణాటక


సుదీర్ఘ పోరాటం తర్వాత దక్షిణాదిలోనే తొలిసారిగా కర్ణాటకలో వికసించి అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీ.. తట్టా బుట్టా సర్దుకోవడానికి సమయం ఆసన్నమైంది. మే 5న జరగనున్న విధాన సభ ఎన్నికల్లో కమలం ఓడిపోవడం, కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో అధికారాన్ని చేపట్టడం జరుగుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సీఎన్ఎన్ ఐబిఎన్ కోసం చేసిన సర్వేలో కర్ణాటకలో కాంగ్రెస్ కు 37 శాతం ఓట్లు లభిస్తాయని, మొత్తం 224 స్థానాలకుగాను, 117 నుంచి 129 సీట్లను కైవసం చేసుకుంటుందని వెల్లడైంది. బీజేపీకి 39 నుంచి 49 సీట్ల వరకూ రావచ్చని సర్వేలో పాల్గొన్నవారి అభిప్రాయాల ప్రకారం తెలిసింది. జేడిఎస్, బీజేపీ నుంచి వెళ్లిన యడ్యూరప్ప కొత్తగా స్థాపించిన కర్టాటక జనతాపార్టీలకు ఏమంత సీట్లు రావని తేలింది.

ముఖ్యంగా బీజేపీకి యడ్యూరప్ప, ఆయనకు మద్దుతునిచ్చే ఎమ్మెల్యేలు, శ్రీరాములు దూరం కావడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, తరచూ ముఖ్యమంత్రులను మార్చడం, పార్టీని అధిష్ఠానం గాడిలో పెట్టకపోవడం ప్రతికూలంగా మారాయి. వాస్తవానికి యడ్యూరప్ప బీజేపీని వీడి బాగుకోపోయినా ఆ పార్టీని దెబ్బతీయడం ద్వారా తన కడుపుమంట చల్లార్చుకోనున్నారు.

  • Loading...

More Telugu News