: కొత్త సంప్రదాయానికి శ్రీకారం... ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం


దేశంలోని చట్టసభ వ్యవహారాలకు సంబంధించి తొలిసారిగా ఏపీ అసెంబ్లీలో సరికొత్త సంప్రదాయానికి తొలి అడుగు పడింది. ప్రజా సమస్యలపై అర్థవంతమైన, వేగవంతమైన చర్చకోసమంటూ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రతిపాదించిన ‘ప్రశ్నోత్తరాలు ముందు... వాయిదా తీర్మానాలు ఆ తర్వాతే’’ అన్న సంప్రదాయానికి సభ శ్రీకారం చుట్టింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు నాటి కార్యక్రమాల్లో భాగంగా జాతీయ గీతాలాపన తర్వాత పాత సంప్రదాయానికి భిన్నంగా వాయిదా తీర్మానాలను ప్రస్తావించని స్పీకర్, ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో సభ ప్రారంభం కాగానే జరిగే గొడవకు దాదాపుగా తెరపడిపోయింది.

  • Loading...

More Telugu News