: బెయిలా?... కస్టడీనా?: రావెల సుశీల్ పై నేడు కోర్టు కీలక నిర్ణయం
మద్యం మత్తు తలకెక్కిన క్రమంలో మహిళ చేయి పట్టి లాగిన కేసులో టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ వ్యవహారానికి సంబంధించి నాంపల్లి కోర్టు నేడు కీలక నిర్ణయం వెలువరించనుంది. అరెస్టైన వెంటనే రావెల సుశీల్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశాడు. అదే సమయంలో ఈ కేసులో సుశీల్ ను విచారించాల్సి ఉందని పేర్కొన్న హైదరాబాదు పోలీసులు అతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనున్న కోర్టు కీలక నిర్ణయం వెలువరించనుంది.