: కెప్టెన్ కూల్ పై విరాట్ ప్రశంసలు జల్లు... ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ గా అభివర్ణన


టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ (టీ20, వన్డే) జట్టు సారధి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీపై టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిన్న ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచంలోనే ధోనీ బెస్ట్ ఫినిషర్ అంటూ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్టు జట్టు కెప్టెన్ గా ఎంపికైన కోహ్లీ... ఇదివరకు ధోనీని కీర్తించిన దాఖలా దాదాపుగా లేదనే చెప్పాలి. అయితే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లా జట్టుపై కేవలం ఆరంటే ఆరు బంతుల్లోనే 20 పరుగులు పిండేసిన ధోనీ... తనదైన రీతిలో వీర విహారం చేశాడు. అంతేకాక తనదైన స్టైల్ విన్నింగ్ షాట్ తో ధోనీ మ్యాచ్ ను ముగించిన తీరు క్రీజులో ఆ వైపున ఉన్న కోహ్లీ ప్రత్యక్షంగా చూశాడు. ఈ సందర్భంగా నిన్న అతడు ధోనీ హిట్టింగ్ ను మరోమారు గుర్తు చేసుకుని... ప్రపంచంలోనే ధోనీని మించిన బెస్ట్ ఫినిషర్ మరొకరు లేరంటూ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News