: ఐఎస్ఐఎస్ ఇంత పెద్ద కుట్ర చేస్తోందా?
ఇస్లాం రాజ్యస్థాపనకు పాటుపడుతున్నామని చెప్పే ఐఎస్ఐఎస్ దురాగతాలకు అంతం లేని సంగతి తెలిసిందే. షరియా చట్టం పేరుతో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ప్రపంచానికి అతిపెద్ద ముప్పును తెచ్చిపెడుతున్నారు. మొత్తం 31 వేల మంది మహిళల కడుపుల్లో భవిష్యత్ ఉగ్రవాదులు పెరుగుతున్నారని లండన్ కు చెందిన ఖిల్లియమ్ అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. గర్భిణులకు వివిధ సౌకర్యాలు కలుగజేసిన ఉగ్రవాదులు వారు చదివేందుకు ఉగ్ర సాహిత్యాన్ని అందుబాటులో ఉంచారు. అలాగే వారు వినేందుకు ఉగ్రవాద సాహిత్య గీతాలను అందజేస్తున్నారు. అలాగే పిల్లలు పుట్టాక వారు ఇతర మతాల వారిని ద్వేషించడం ఎలా? అనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యేక సందేశాలు వినిపిస్తున్నారు. ఇప్పుడున్న ఉగ్రవాదులు మరణించినా, భవిష్యత్తులో ఐఎస్ఐఎస్ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారని ఆ నివేదిక తెలిపింది. ఈ నివేదికను చదివిన ప్రపంచ దేశాలు షాక్ కు గురయ్యాయి.