: అవిశ్వాస తీర్మానానికి వైఎస్సార్సీపీ రెడీ...సై అంటున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రక్తికట్టించనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సమావేశాలు ప్రారంభమైన అనంతరం గవర్నర్ ప్రసంగంపై పార్టీలన్నీ ధన్యవాదాలు తెలియజేయాల్సిఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రసంగం అనంతరం వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడే గవర్నర్ ప్రసంగంపై తన అభిప్రాయం చెప్పిన తరువాత నేరుగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీంతో వైఎస్సార్సీపీ వ్యూహం తెలుసుకున్న టీడీపీ ప్రతివ్యూహరచనలో నిమగ్నమైపోయింది. దీంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాడిగా వేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.