: టీమిండియా, పాక్ దిగ్గజాలు ఏమంటున్నారంటే...!


పాకిస్థాన్ ఆటగాళ్లను తాము ఏనాడూ శత్రువులుగా భావించలేదని టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. భారత్, పాక్ ఆడితే చూడాలని ఇరు దేశాల ప్రజలు కోరుకుంటున్నారని పాకిస్థాన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ తెలిపాడు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. తమ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని ఇద్దరూ చెప్పారు. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించడం ద్వారా రెండు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తగ్గించవచ్చని ఇంజీ పేర్కొన్నాడు. తమ అభిమాన ఆటగాళ్ల విన్యాసాలు చూడాలని రెండు దేశాల క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారని ఇంజీ చెప్పాడు. గంగూలీ మాట్లాడుతూ, పాకిస్థాన్ ఆటగాళ్లను తాము ఏనాడూ శత్రువులుగా భావించలేదని, సమఉజ్జీలుగా భావించామని చెప్పాడు. అప్పట్లో పాకిస్థాన్ జట్టులో వెతికేందుకు ఏ లోపాలు కనిపించేవి కాదని గంగూలీ పేర్కొన్నాడు. ఇంజమాముల్ హక్, ఇజాజ్ అహ్మద్, యూనిస్ ఖాన్, షాహిద్ అఫ్రిదీ, మొయిన్ ఖాన్ లాంటి బ్యాట్స్ మన్ కు తోడు, ప్రపంచంలోనే పేరొందిన బౌలర్లు పాక్ కు ఉండేవారని గంగూలీ గుర్తుచేసుకున్నాడు. పాకిస్థాన్ తో ఆడడం గొప్ప అనుభూతిని ఇచ్చేదని గంగూలీ చెప్పాడు.

  • Loading...

More Telugu News