: అవి ఎవరినీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదు...సరదాగా చేసినవి: బాలకృష్ణ వివరణ


'సావిత్రి' ఆడియో వేడుకలో తాను చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణ స్పందించారు. సోషల్ మీడియాలో విమర్శల జోరు పెరుగుతుండడంతో ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాను ఆడియో వేడుక సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదని అన్నారు. ఆ సందర్భంలో సరదాగా అలా వ్యాఖ్యానించానే తప్ప, ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో అలా మాట్లాడలేదని ఆయన చెప్పారు. అలా కాకుండా తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే మన్నించాలని కోరుతున్నానని బాలయ్య తెలిపారు. మహిళలను గౌరవించడం తన తండ్రి నుంచి వచ్చిన సంస్కారమని, తనను అపార్థం చేసుకోవద్దని ఆయన కోరారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవం ఉందని ఆయన చెప్పారు. తమ సంప్రదాయం ప్రకారం మహిళలను తమ ఇంటి ఆడపడుచులుగా చూస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News