: పాక్ జట్టులో మార్పులు... ఖుర్రంపై వేటు...షెహజాద్ కు చోటు!


ఆసియా కప్ లో జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. టీట్వంటీ వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపధ్యంలో అద్భుత విజయాలతో రాణించాల్సిన జట్టు బంగ్లాదేశ్ పై ఓడడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో టోర్నీలో విఫలమైన ఖుర్రం మంజూర్ కు ఉద్వాసన పలికింది. అతని స్థానంలో టీట్వంటీల్లో అనుభవజ్ఞుడైన అహ్మద్ షెహజాద్ ను జట్టులోకి తీసుకుంది. కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పు లేదని పీసీబీ పేర్కొంది. దీంతో టీట్వంటీ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టుకు షాహిద్ అఫ్రిదీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. టీట్వంటీ ప్రపంచ కప్ టోర్నీలో మార్చి 16న పాకిస్థాన్ తొలి మ్యాచ్ ఆడనుండగా, 19న భారత్ ను ఢీ కొట్టనుంది. దీంతో మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలని పీసీబీ కోరుకుంటోంది.

  • Loading...

More Telugu News