: లక్ష రూపాయలకు భార్య, కుమార్తెను ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టాడు
లక్ష రూపాయల ధరకు కట్టుకున్న భార్య, కన్న బిడ్డను ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని ఖార్గోనే జిల్లా శభమ్ నగర్ లో నివాసం ఉంటున్న దిలీప్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ లో తన భార్య, కుమార్తెను అమ్ముతున్నట్టు పేర్కొంటూ వారి ఫోటోలను లక్ష రూపాయల ట్యాగ్ తో పెట్టాడు. దీంతో దిలీప్ కు పలువురు ఫోన్లు చేశారు. ఓ వ్యక్తి మాత్రం నేరుగా పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దిలీప్ పై కేసు నమోదు చేసి, అతనిని అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ కు నాలుగేళ్ల క్రితం వివాహం కాగా, ఆ దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. అతనిని అదుపులోకి తీసుకోగానే, ఫేస్ బుక్ లో ఆయన పెట్టిన పోస్టు తీసేయించారు.