: శ్రీకాళహస్తి బోర్డు సభ్యుల 'వీఐపీ దందా'పై మండిపడ్డ ఈఓ భ్రమరాంబ
శ్రీకాళహస్తీశ్వరునికి శివరాత్రి వేడుకల వేళ, బోర్డు సభ్యుల తీరు అత్యంత ఆక్షేపణీయమని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి భ్రమరాంబ ఆరోపించారు. పాలక మండలి తీరు బాగాలేదని, వీఐపీలకు మాత్రమే పెద్దపీట వేస్తూ, సామాన్య భక్తులను ఎంతమాత్రమూ దర్శనానికి వదలడం లేదని ఆమె ఆరోపించారు. బోర్డు సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం వల్ల భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అధికారులు కల్పించుకోలేకపోతున్నారని అన్నారు. తమవారి దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, నిమిషానికోసారి క్యూ లైన్లను నిలుపుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్టు భ్రమరాంబ తెలిపారు.