: 'కన్నయ్య జాతిద్రోహం' వీడియోలు చూపిన చానళ్లపై కేసులు!
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరిగిన సంఘటనలకు సంబంధించి మార్ఫింగ్ చేసిన వీడియోలను ప్రసారం చేసిన మూడు టెలివిజన్ న్యూస్ చానళ్లపై కేసులు నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 9న వర్శిటీలో 'పాకిస్థాన్ జిందాబాద్' అన్న నినాదాలు అనలేదని, వీడియో టేపుల్లో ఉన్న దృశ్యాలను మార్ఫింగ్ చేసి బయటి గొంతులను అతికించారని ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేయడంతో కేజ్రీవాల్ సర్కారు దృశ్యాలను ప్రసారం చేసిన చానళ్లపై చర్యలకు ఆదేశించింది. ఈ వీడియోలు బయటకు వచ్చిన తరువాతనే కన్నయ్య కుమార్ పై దేశద్రోహం కేసు, ఆపై అరెస్ట్, కోర్టులో దాడి తదితర ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.