: ముంబైలో టీట్వంటీ ప్రచారకర్తలు డబ్బావాలాలు


ముంబైలో టీట్వంటీ వరల్డ్ కప్ ప్రచార బాధ్యతలను డబ్బావాలాలు తీసుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన చైన్ మార్కెట్ గా పేరొందిన డబ్బా వాలాల గురించి తెలియని ముంబైకర్ ఉండడంటే అతిశయోక్తి కాదు. ముంబైలోని ప్రతి ప్రాంతంలో వీరికి ఆదరణ ఉంది. ప్రతి ప్రాంతంలోనూ వీరు సేవలందిస్తారు. ప్రతి ప్రాంతంపై వీరికి పట్టుంది. దీంతో ప్రచారానికి వీరిని వినియోగించుకోవాలని బీసీసీఐ భావించింది. దీంతో ముంబై వ్యాప్తంగా సేవలందించే 50 వేల మంది డబ్బావాలాలకు టీట్వంటీ ప్రపంచకప్ అడ్వర్టైజ్ మెంట్ కలిగిన టీషర్టులు అందజేయనుంది. ఇవి వేసుకుని డబ్బావాలాలు ముంబైరోడ్లపై తిరిగితే టీట్వంటీ వరల్డ్ కప్ కు కావాల్సినంత ప్రచారం దక్కుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఇలా ప్రచారంలో పాల్గొన్నందుకుగాను టోర్నీ సూపర్ 10కు చేరుకున్న తరువాత ముంబై ఆతిథ్య మ్యాచ్ లకు 25 మంది డబ్బావాలాలను ఎంపికి చేసి వారికి ప్రత్యేకమైన దుస్తులు అందజేస్తారు. వీరు ఆ మ్యాచ్ లను ఉచితంగా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తారు.

  • Loading...

More Telugu News