: లోకేష్, బాలకృష్ణనూ వదలని రోజా!


ఏపీలో కీచక పాలన సాగుతోందని, ఆడపిల్లను కనడమే నేరమనట్టు స్వయంగా హిందుపురం శాసనసభ్యుడు బాలకృష్ణ మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. లోకేశ్ గతంలో తన స్నేహితులతో కలిసున్న ఫోటోలను చూపుతూ, ఈయనా యువనేత? అని ప్రశ్నించారు. మందు, విందులతో కాలం గడిపే లోకేశ్ కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని అడిగారు. ఓ ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను రోజా ప్రస్తావించారు. యువతుల పట్ల తానేం మాట్లాడాడో బాలకృష్ణ రికార్డులు చూసుకోవాలని హితవు పలికారు. నేతలే అలాగుంటే, మంత్రుల కొడుకులు ఇంకా రెచ్చిపోతున్నారని రావెల కిషోర్ బాబు తనయుడి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, దుయ్యబట్టారు. రావెలను తక్షణం చంద్రబాబు మంత్రివర్గం నుంచి తొలగించాలని రోజా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News