: మేనల్లుడు హరీశ్ తో కలిసి ముంబై బయలుదేరిన కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ముంబై బయల్దేరారు. గోదావరి నదిపై సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం ముంబై బయలుదేరిన కేసీఆర్ వెంట ఆయన మేనల్లుడు, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కేసీఆర్ బృందం మరికాసేపట్లో ముంబైలో ల్యాండ్ కానుంది. ముంబై చేరుకోగానే నేరుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కేసీఆర్ భేటీ కానున్నారు. సాగునీటి పంపకాలకు సంబంధించి ఇరువురు సీఎంల సమక్షంలో రెండు రాష్ట్రాల అధికారులు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.