: టెర్రర్ అలర్ట్... విజయవాడకు కూడా!
దేశంలో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో పలు నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాలను భద్రతాదళాలు అప్రమత్తం చేశాయి. ఈ నగరాలన్నీ 'ఉగ్రలిస్టు'లో ఉన్నాయని చెబుతూ, అక్కడి ప్రభుత్వాలను, పోలీసులనూ జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఇప్పటికే న్యూఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించగా, కొద్దిసేపటి క్రితం మరిన్ని నగరాలపై దాడులకు అవకాశాలు ఉన్నాయని ఐబీ హెచ్చరించింది. వాటిల్లో నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ కూడా ఉంది. విజయవాడతో పాటు లక్నో, జయపుర, భోపాల్, చండీగఢ్ లకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో విజయవాడలో పోలీసులు సోదాలు జరుపుతున్నారు.