: అదే ఏపీలో అయితే... కుక్క పేరు చెప్పి తప్పించుకునేవారు!:‘రావెల’ ఉదంతంపై రోజా విసుర్లు


మహిళను అడ్డగించి, ఆపై చేయి పట్టి కారులోకి లాగేందుకు యత్నించిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల్ కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ ఉదంతంపై వైపీసీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తెలంగాణ పరిధిలో జరిగింది కాబట్టి రావెల సుశీల్ పై కేసు నమోదైందని పేర్కొన్న ఆమె... ఈ ఘటన ఏపీలో జరిగి ఉంటే, కుక్క పేరు చెప్పుకుని తప్పించుకునేవారని ఎద్దేవా చేశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదు లోటస్ పాండ్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని రోజా ఆరోపించారు. టీడీపీ నేతలకు మహిళా దినోత్సవాన్ని నిర్వహించే అర్హత లేదని ఆమె తేల్చిచెప్పారు. టీడీపీ నేతలు మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. నడిరోడ్డుపై మహిళ చేయి పట్టి లాగిన పుత్రరత్నాన్ని వెనకేసుకువచ్చిన రావెల కిశోర్ బాబును తక్షణమే కేబినెట్ నుంచి సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News