: కన్నయ్యను చంపితే రూ. 11 లక్షలిస్తానన్న వ్యక్తి దగ్గరున్నది కేవలం రూ. 150 మాత్రమే!
జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ ను చంపిన వారికి రూ. 11 లక్షలు ఇస్తానని ప్రకటించిన పూర్వాంచల్ సేన అధ్యక్షుడు ఆదర్శ శర్మ బ్యాంకు ఖాతాలో ఉన్నది కేవలం రూ. 150 మాత్రమేనట. రోహిణీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన, కనీసం రెంట్ చెల్లించేందుకే అష్టకష్టాలు పడుతున్నాడని తెలుస్తోంది. కాగా, కన్నయ్యను హత్య చేయాలని కోరుతూ, వారికి భారీగా నజరానా ఇస్తామని ఆదర్శ్ సంతకంతో కూడిన పోస్టర్లు వెలియగా, ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆదర్శ శర్మ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉంది.