: అడ్డగోలు సాద్వి ప్రాచి, ఆదిత్యానాథ్ లను బీజేపీ నుంచి గెంటేసి జైల్లో పెట్టండి: అనుపమ్ ఖేర్
బీజేపీలో ఉండి అడ్డగోలుగా మాట్లాడుతూ, ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్న నేతలను బయటకు గెంటేయాలని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. జడత్వం నిండిన మనస్తత్వంతో, ఏం మాట్లాడుతున్నారో తెలీకుండా ప్రకటనలు చేస్తున్న సాద్వి ప్రాచి, యోగి ఆదిత్యానాథ్ వంటి వారిని జైలుకు తరలించాలని అన్నారు. ఇండియాలో అసహనం గురించి మాట్లాడుతున్నది సామాన్యులు కాదని, డబ్బున్నవారు, ప్రముఖులు మాత్రమేనని అనుపమ్ అన్నారు. బీజేపీకి ఇబ్బందులు తెస్తున్న నేతల సేవలు అక్కర్లేదని అన్న ఆయన, కాంగ్రెస్ లోనూ పలువురు చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.