: బహుభర్తత్వం ఎందుకు కూడదు?: ప్రశ్నించిన కేరళ జడ్జి


కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కమల్ పాషా ముస్లిం వివాహ చట్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వివాహ చట్టంలో ఓ వ్యక్తి నలుగురిని వివాహం చేసుకునేందుకు వీలుందని, ఇదే సమయంలో మహిళలకు అదే అవకాశం ఎందుకు లేదని ప్రశ్నించారు. ముస్లిం చట్టాలు మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయని, పురుషాధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో పాల్గొని ప్రసంగించిన ఆయన, ఎన్నో ముస్లిం దేశాలు బహుభార్యత్వంపై నిషేధాన్ని అమలు చేస్తున్నాయని గుర్తు చేసిన ఆయన, ఇండియాలో మాత్రం కొనసాగుతోందని అన్నారు. సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకునేందుకు సిద్ధంగాలేని, ఈ విషయంలో మహిళాలోకమే కదలాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News