: ఈ-మెయిల్ సృష్టికర్త రే టామ్లిన్సన్ ఇక లేరు!... గుండెపోటుతో మరణించిన ప్రఖ్యాత ప్రోగ్రామర్


ఉత్తరాలకు చెల్లుచీటి ఇచ్చిన ‘ఈ-మెయిల్’ సృష్టికర్త రే టామ్లిన్సన్ (74) ఇక లేరు. అమెరికాకు చెందిన ఈ ప్రఖ్యాత ప్రోగ్రామర్ గుండెపోటుకు గురై శనివారం తుదిశ్వాస విడిచారు. బోస్టన్ కు చెందిన ‘బోల్ట్, బెరానెక్ అండ్ న్యూమాన్’ కంపెనీలో పనిచేస్తున్న సందర్భంగా టామ్లిన్సన్ తొలిసారిగా 1971లో ఈ-మెయిల్ సందేశాన్ని పంపారు. తొలినాళ్లలో ఇంటర్నెట్ వెర్షన్ అయిన ‘అర్పానెట్’ను అభివృద్ధి చేయడంలో ఈ కంపెనీ విశేష కృషి చేసింది. ఆర్పానెట్ పైనే టామ్లిన్సన్ తొలి ఈ-మెయిల్ పంపారు. ప్రస్తుతం ఈ-మెయిల్ ఐడీల్లో తప్పనిసరిగా మారిన ‘ఎట్ (@)’ ను కూడా టామ్లిన్సనే ప్రవేశపెట్టారు.

  • Loading...

More Telugu News