: వైసీపీ ఎమ్మెల్యే కారు దొరికిందోచ్!... ఎమ్మెల్యే ఇంటి సమీపంలో వదిలి వెళ్లిన దొంగలు


వైసీపీ సీనియర్ నేత, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి చెందిన కొత్త కారు ఎట్టకేలకు దొరికింది. కొత్తగా కొనుగోలు చేసిన రెండు రోజులకే ఎమ్మెల్యే ఇంటి ఆవరణ నుంచే కారును ఎత్తుకెళ్లిన దొంగలు... ఆదివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో వదిలేసి వెళ్లిపోయారు. అయితే కారును ఎత్తుకెళ్లిన దొంగలు ఎవరన్న విషయం మాత్రం తెలియరాలేదు. తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు కారుతో పాటు ఎస్వీ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా రికార్డర్లను ఎత్తుకెళ్లిన దొంగలు పోలీసులకు పెను సవాల్ విసిరారు. కారు చోరీకి సంబంధించి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న కర్నూలు టూ టౌన్ పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగించారు. ఈ క్రమంలో ఎస్వీ మోహన్ రెడ్డి వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్న వారితో పాటు మరికొంత మంది సన్నిహితులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో దొంగలు గుట్టుచప్పుడు కాకుండా కారును ఎమ్మెల్యే ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో పార్కు చేసి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News