: బంగ్లా కుర్రాళ్లు రాణించారు... భారత్ టార్గెట్ 121 పరుగులు!
మిర్పూర్ లో జరుగుతున్న ఆసియా కప్ 'టీ ట్వంటీ' ఫైనల్ లో భారత్ కు 121 పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ ఆటగాళ్లు నిర్దేశించారు. ఆట ప్రారంభం సమయానికి వర్షం పడి, పిచ్ చిత్తడిగా మారడంతో, ఆటను 15 ఓవర్లకు కుదించారు. దాంతో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ ధోనీ బంగ్లాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఓపక్క వికెట్లు పడుతున్నప్పటికీ, బంగ్లా కుర్రాళ్లు స్వేచ్ఛగా ఆడుతూ ఐదు వికెట్ల నష్టానికి నిర్ణీత 15 ఓవర్లలో 120 పరుగులు పిండుకున్నారు. భారత్ బ్యాట్స్ మెన్ ముందు కాస్త పెద్ద లక్ష్యాన్నే ఉంచారు. దీంతో విజయాన్ని చేరుకోవాలంటే భారత్ ఆటగాళ్లు శ్రమటోడ్చాల్సి వుంది. కాసేపట్లో భారత్ బ్యాటింగ్ మొదలవుతుంది.