: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 14న బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10న గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. శాసన సభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 14న ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రెండు గంటలకుపైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. ఈ నెల 10న ఉభయసభల్లో జరిగే గవర్నర్ ప్రసంగ పాఠాన్ని ఖరారు చేశారు. జలమండలి, మిషన్ భగీరథకు నిధుల కేటాయింపుపై చర్చించారు. జలమండలికి రూ.1900 కోట్లు, మిషన్ భగీరథకు రూ.1900 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.