: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ
ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకోవడంతో ఆలస్యంగా ప్రారంభమైంది. అసలు జరుగుతుందో లేదో అనే ఉత్కంఠ మధ్య 15 ఓవర్ల మ్యాచ్ ను నిర్వహించనున్నామని అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. వర్షంతో చిత్తడిగా మారిన పిచ్ పై టాస్ టీమిండియా గెలుచుకుంది. దీంతో మరో ఆలోచనకు తావు లేకుండా ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా వ్యూహం సులువుగా అర్థమవుతుంది. చిత్తడిగా ఉన్న పిచ్ పై పరుగులను నియంత్రించి, వికెట్లను తీయాలని టీమిండియా భావిస్తోంది. మరోపక్క, స్కోరు బోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా, బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.