: 'జెమిని' సినిమా విలన్ కళాభవన్ మణి మృతి


వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'జెమిని' సినిమాలో విలక్షణమైన ప్రతినాయకుడుగా నటించిన మలయాళ నటుడు కళాభవన్ మణి మృతి చెందారు. కాలేయ వ్యాధితో కొచ్చిలోని ఆసుపత్రిలో చేరిన కళాభవన్ మణి చికిత్స పొందుతూ తనువు చాలించారు. ఆటోడ్రైవర్ గా జీవితం ప్రారంభించిన ఆయన స్థానిక స్టేజ్ షోలలో పాల్గొని పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అనంతరం సినిమా నటుడిగా మారారు. ఆయన మలయాళంలో అంధుడిగా ప్రధానపాత్రలో నటించిన చిత్రాన్ని తెలుగులో ఆర్పీ పట్నాయక్ హీరోగా 'శీను వాసంతి లక్ష్మి' సినిమాను రూపొందించారు. జెమిని సినిమాలో కళాభవన్ మణి పోషించిన పాత్ర అతనికి మంచి పేరు తీసుకువచ్చింది. అనంతరం 'ఎవడైతే నాకేటి', 'అర్జున్' తదితర సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వందకు పైగా సినిమాల్లో ఆయన నటించారు.

  • Loading...

More Telugu News