: అవినీతి వ్యవహారంలో ఇరాన్ సంపన్నుడికి మరణశిక్ష!


ఇరాన్ లోని ఓ సంపన్న వ్యాపారి అవినీతికి పాల్పడ్డాడని ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే...ఇరాన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబక్ జంజానీ అవినీతికి పాల్పడ్డాడని నిర్ధారించిన టెహ్రాన్ న్యాయస్ధానం మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దేశవిదేశాల్లో తన కంపెనీ ద్వారా అమ్మిన చమురు రాబడిలో బిలియన్ల డాలర్ల ధనాన్ని తనవద్దే అక్రమంగా ఉంచుకున్నాడన్న ఆరోపణలపై 2013 డిసెంబర్ లో బాబక్ జంజానీని ప్రభుత్వం అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఈ కేసును విచారించిన న్యాయస్థానం, ఆయన తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు నిర్ధారించింది. దీంతో బాబక్ జంజానీ సహా మరో ఇద్దరికి మరణిశిక్ష విధించింది. దుర్వినియోగమైన నగదును తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అతనిపై ఆంక్షలు విధించిన సమయంలో జంజానీ మలేసియా, యూఏఈ, టర్కీలలో తన కంపెనీల పేరుతో చమురు విక్రయాలు జరిపారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 13.3 బిలియన్ డాలర్లు.

  • Loading...

More Telugu News