: రావెల కుమారుడు సుశీల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ తనను వేధించాడంటూ ఓ ముస్లిం మహిళ పెట్టిన కేసులో సుశీల్ కు, కారు డ్రైవర్ రమేశ్‌కు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీరిరువురినీ హైదరాబాదులోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా సుశీల్ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది. తుర్కయంజాల్‌లోని మేజిస్ట్రేట్ ఇంట్లో పోలీసులు సుశీల్ ను, డ్రైవర్ రమేశ్‌ను హాజరుపరిచిన సంగతి తెలిసిందే.