: అధికారం చేపట్టి 20 నెలలు అయింది...ఏం చేశారు: సోము వీర్రాజు


టీడీపీ అధికారం చేపట్టి 20 నెలలు అయిందని...ఇంత వరకు ఏమీ చేయలేదని బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్రంగా విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్కదారిపట్టించిందని అన్నారు. పట్టిసీమ పోలవరంలో భాగమా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం కేటాయించిన నిధుల్లో కుడి కాల్వకు కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని మిగిలిన 1500 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ఆయన అడిగారు. పోలవరంలో ఇప్పటి వరకు కేవలం ఒకటిన్నర శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 98 1/2శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి? రాష్ట్రంలో చేస్తున్నది ఏంటని ఆయన నిలదీశారు. బీజేపీ ప్రతిష్ఠను దిగజార్చడంలో భాగంగా ఏపీలో గొబెల్స్ ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News