: ఆసియా కప్ ఫైనల్ ను అడ్డుకున్న వరుణుడు


ఆసియాకప్ టైటిల్ పోరును వరుణుడు అడ్డుకున్నాడు. ఈ టోర్నీలో అద్భుతమైన ఫాం కొనసాగిస్తూ, సమతూకంతో ఉన్న భారత జట్టును, సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్ జట్టు ఎదుర్కోనుంది. దీంతో ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆతిథ్య బంగ్లాదేశ్ ఫైనల్ కు చేరడంతో ఆ జట్టు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మీర్పుర్ లో కురిసిన వర్షం ధాటికి 'షేర్ ఈ బంగ్లా' స్టేడియం చిత్తడిగా మారింది. అవుట్ ఫీల్డ్ ఆడేందుకు అనువుగా లేకపోవడంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. 8 గంటలకు అంపైర్లు పిచ్, అవుట్ ఫీల్డ్ ను పరిశీలించిన అనంతరం మ్యాచ్ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించాలని రిఫరీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ నిర్వహణపై రిఫరీదే అంతిమ నిర్ణయం కావడంతో అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ కు రిజర్వ్ డే లేకపోవడంతో టోర్నీ ఆద్యంతం రాణించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ టైటిల్ ను గెలుచుకునే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News