: తుపాకీ చూపినా భ‌య‌ప‌డ‌ని వీర‌నారి.. దొంగను కుమ్మేసింది!


నిజ‌జీవితంలో కొన్నిసార్లు సినిమాను మించిన సాహ‌సాలు క‌నిపిస్తాయి. అటువంటి అద్భుత సాహ‌సాన్నే ప్ర‌ద‌ర్శించిన ఓ భార‌తీయ మ‌హిళ అంద‌రితోనూ శ‌భాష్ అనిపించుకుంది. కీస్‌వెల్లేలోని ఓ కిరాణా దుకాణంలో భూమిక పటేల్ అనే భారతీయ మహిళ క్యాషియర్‌గా పనిచేస్తోంది. 17 ఏళ్ల క్రిస్టియన్ డకోటా అనే యువ‌కుడు ఆమె పనిచేస్తున్న షాప్‌లో దొంగతనానికి యత్నించాడు. తుపాకీని పాయింట్ బ్లాక్‌లో పెట్టి మ‌రీ డబ్బు ఇచ్చేయమంటూ బెదిరించాడు. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌ని భూమిక దొంగ‌కే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. తుపాకి చూపిన దొంగ‌తో "న‌న్ను కాల్చుతావా? ఏదీ కాల్చూ చూస్తా" అంటూ ధైర్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. తుపాకీని ప‌క్క‌కు తోసి, చేతికందిన వ‌స్తువుతో దొంగ‌ను చిత‌క‌బాదింది. అక్క‌డే ఉన్న సుత్తితో దాడికి ప్ర‌య‌త్నించ‌డంతో ఆ దొంగ ప్రాణాలు కాపాడుకోవ‌డ‌మే ఇక త‌న ప‌ని అన్న‌ట్లు ప్ర‌య‌త్నించి త‌ప్పించుకు పారిపోయాడు. అత్యంత‌ సాహసాన్ని ప్రదర్శించిన భూమిక పటేల్ ఇప్పుడు అక్క‌డ‌ స్థానికంగా ఐకాన్ అయ్యారు. భూమిక ప్ర‌ద‌ర్శించిన సాహ‌సం అక్క‌డి సీసీటీవీ కెమెరా వీడియో ఫుటేజీని స్థానికులు ఆశ్చ‌ర్యంతో తిలకించారు. అక్క‌డి మీడియా సైతం ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది

  • Loading...

More Telugu News