: ప్రశాంతంగా ముగిసిన వరంగల్, ఖమ్మం ఎన్నికలు


తెలంగాణలోని గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మునిసిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో నిల్చున్న వారికి ఓట్లేసే అవకాశం కల్పించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. అచ్చంపేటలో అత్యధికంగా 69 శాతం, ఖమ్మంలో 63 శాతం, వరంగల్ లో 60 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈనెల 15న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపట్టనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, వినయభాస్కర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News